![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో..... గౌతమిని కళ్యాణ్ గురించి అడిగి.. తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఆ కళ్యాణ్ తో ఏంటే ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావని గౌతమిపై జానూ కోప్పడుతుంది. నన్ను అంటున్నావ్ మరి ఆ సూర్యతో తిరుగుతున్నావు కదా అని గౌతమి అంటుంది. నేను ఫ్యామిలీ గురించి తన హెల్ప్ తీసుకున్నానని జానూ అంటుంది. నాన్న బాధ్యత నువ్వు తీసుకున్నావని నా పర్సనల్ స్పేస్ గురించి పట్టించుకోకని గౌతమి అంటుంది. వదిలేయ్ జానూ అదేదో తెలియక మాట్లాడుతుంది.. నువ్వు తోట గురించి ఆలోచించమని నందు అంటుంది.
ఆ తర్వాత సింహాద్రి బ్యాంకు నుంచి మేనేజర్స్ ని పిలిపించి మాట్లాడుతాడు. తోట నా సొంతం అయింది కానీ శంకర్ కూతురు జానూ సామాన్యురాలు కాదు అంత ఈజీగా వదిలి పెట్టదు. మీరంతా నేను చెప్పినట్టు చెయ్యాలని వాళ్ళకి కొంత డబ్బు ఇస్తాడు. మీరు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళకి ఏదో ప్లాన్ చెప్తాడు. మరొకవైపు తోట డబ్బులు పూర్తిగా కట్టాలంటే ఇల్లు తాకట్టు పెట్టాలి.. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. అక్క పెళ్లి చెయ్యాలని జానూ అనుకుంటుంది. ఈ విషయం గురించి సూర్యతో ఒకసారి డిస్కషన్ చెయ్యాలని జానూ అనుకుంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి గౌతమి ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి .. నన్ను పెళ్లి చేసుకోమని గౌతమి అనగానే వద్దు ఇప్పుడు.. ఇంకా మన చదువు పూర్తికాలేదని కళ్యాణ్ అంటాడు. మా అమ్మ ఇప్పుడు చూస్తే చంపేస్తుందని గౌతమి అనడం.. పెద్దావిడ వింటుంది. దాంతో తనని గౌతమి మాటలతో కవర్ చేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.ఆ తర్వాత నందుకి మురళి ఫోన్ చేస్తాడు. అమెరికా అబ్బాయి అనుకొని నందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మురళి వాయిస్ విని.. నువ్వా టైలర్ బావ అని మాట్లాడుతుంది. నేను ఇంకా నాకు కాబోయే వాడేమో అని అనుకున్నానని నందు అంటుంది. మీరు బాధలో ఉన్నారని చేసానని మురళి అనగానే మురళి బాధపడేలా నందు మాట్లాడుతుంది.
మరొకవైపు సూర్యని కలవడానికి జానూ తన ఇంటికి వస్తుంది. అప్పుడే సూర్య ఏదో ఫ్యాన్ రిపేర్ చేస్తూ ఉంటాడు సూర్య పడిపోతుంటే జాను పట్టుకుంటుంది. తరువాయి భాగంలో అసలు తోట అమ్మిన అతని దగ్గరికి సూర్య, జానూ వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |